విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ అన్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నగరంలోని అజిత్ సింగ్ నగర్ డా. వైఎస్సార్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం శుక్రవారం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రైలజారెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలకు జగనన్న ఆరోగ్య సురక్ష వరం కానున్నదన్నారు. నేటి నుండి ఇంటింటికి వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, ఆశ కార్యకర్తలు ముందుగా వెళ్లి కార్యక్రమం పై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు దశలుగా నిర్వహించడం జరుగుతుందని మెదటి దశలో ఇంటింటి సర్వే, రెండవ దశలో వైద్య బృందాల ఏర్పాట్లు, మూడవ దశలో ఓరియంటేషన్ కార్యక్రమం, నాలుగో దశలో వైద్య శిభిరాలు, నిర్వహించేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.తొలి దశలోని ఇంటింటి సర్వేలో ప్రాధమిక పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించడంతో పాటు అనంతరం నిర్వహించే వైద్య శిభిరాలలో స్పెషలిస్టులు, పిహెచ్సి డాక్టర్లు, చికిత్స చేసి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారన్నారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రీఫర్ చేస్తారన్నారు. తొలుత వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని కొన్ని రకాల పరీక్షలను అక్కడే నిర్వహిస్తారన్నారు. ఇంటింటి సర్వేలో డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం పై అవగాహన కల్పించి ఈ పథకం ద్వారా అందించే శస్త్ర చికిత్సలు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు అందిస్తున్న సేవలు పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదిన నిర్వహించనున్న క్యాంపులకు సంబంధించిన సమాచారాన్ని అందించి టోకెన్లు జారీ చేస్తారన్నారు. ఈ నెల 30 నుండి 45 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించనున్నామని శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ అన్నారు.జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్‌కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షలో గ్రామీణ ప్రాంతంలో ఎఎన్‌యం, సిహెచ్‌వో, ఆశా, వాలంటీర్లు, ముగ్గురుతో బృందాలుగా ఏర్పాడి ఇంటింటి సర్వే నిర్వహిస్తారన్నారు. వివరాలను ఆరోగ్య సురక్ష యాప్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అక్కడే బిపి,ఘుగర్, యూరిన్, హిమోగ్లోబిన్, కళ్లె, డెంగ్యూ, మలేరియా జ్వరాలు, చర్మంపై దీర్ఘకాలిక మచ్చలు తదితర ఏడు రకాల పరీక్షలను నిర్వహించి, వాటి వివరాలను యాప్‌లో అప్లోడ్ చేసి హెల్త్ ప్రోఫైల్ తయారు చేస్తారన్నారు. ఈ యాప్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా వైద్యం అవసరమైన వారికి కేస్ షీట్ తయారు చేసి వైద్యం అందిస్తారని జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు.అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష, డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్యం పొందడం పై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో డియంఅండ్హెచ్వో డా. యం సుహాసిని, ఎఎన్‌యం, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
Prajavartha Online Telugu News