-మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం – వెలంపల్లి
-మొట్ట మొదట నుండి మేము చెప్తున్నాం టీడీపీ జనసేన ఒకటే – వెలంపల్లి
-పవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది చంద్రబాబు కోసం – వెలంపల్లి
-ఎంత మంది కలిసి వచ్చిన సింగల్ గా మేము సిద్దం – వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 42వ డివిజన్ లోగల పలు ప్రజా సమస్యలు పరిష్కారానికై శుక్రవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అధికారులు నాయకులతో కలసి విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రోజు 42వ డివిజన్ పలు ప్రాంతాలలో పర్యటించడం జరిగిందన్నారు.అన్ని విభాగాల అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించడం జరిగిందన్నారు.ఈ ప్రాంతంలో రోడ్లు అన్ని నూతనంగా నిర్మించామని పార్కులు అన్ని సుందరికరించడం జరిగిందన్నారు.ఇంకా కొన్ని రోడ్లు అభివృద్ది చేయాల్సింది ఉందని వాటిని త్వరితగతిన చేస్తామని హామీ ఇచ్చారు.డ్రైన్ లు అన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు.మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అన్నారు.మొట్ట మొదట నుండి మేము చెప్తున్నాం టీడీపీ జనసేన ఒకటే అని అదే నిన్న పవన్ కళ్యాణ్ ముసుగు తీసేసి చెప్పాడు అని అన్నారు.పవన్ కల్యాణ్ చంద్రబాబు యొక్క దత్తపుత్రుడు అని అన్నారు.పవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది చంద్రబాబు కోసమే అని ఎద్దేవా చేశారు.పార్టీ పెట్టే తన కార్యకర్తలు నాయకులను టీడీపీ కి ఊడిగం చేశారన్నారు.ఈ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద పనికిమాలిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు.ఎంత మంది కలిసి వచ్చినా మాకు ఒరిగేదేమీ లేదన్నారు.ఎంత మంది కలిసి వచ్చిన సింగల్ గా మేము సిద్దం అని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి,పడిగపాటి సుబ్బారెడ్డి,సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తనుబుద్ది చంద్ర శేఖర్ రెడ్డి,పువ్వాడ వెంకటేశ్వర్లు, బండారి వెంకట్,అజీజ్,టి ప్రతాప్ రెడ్డి,రమణ,రాజు,రామరావు డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News