అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, మందడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి కురగల్లు గ్రామంలో జరుగుతున్న “జగనన్న ఆరోగ్య సురక్ష” సర్వేను డాక్టర్ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సి.ఇ.ఓ. యం.యన్.హరేంధిర ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే సిబ్బంది అయిన యం.యల్.హెచ్.పి. రమాదేవి, వాలంటీరు లతో ఆయన మాట్లాడారు. సర్వే ఏవిధంగా నిర్వహిస్తున్నారు?ఏయే పరీక్షలు నిర్వహిస్తున్నారు? సిటిజన్ మొబైల్ నందు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేశారా లేదా? వాలంటీరు ద్వారా ఆరోగ్యశ్రీ బ్రోచర్లు ప్రజలకు అందాయా లేదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ఎఎన్.యం. యాప్ పనితీరు ఏవిధంగా ఉందని తెలుసుకున్న సిఇఓ జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ ను కూడా పరిశీలించారు. సి.ఇ.ఓ. హరేంధిర ప్రసాద్ వెంట గుంటూరు జిల్లా సమన్వయ కర్త డాక్టర్ యన్.జయరామ కృష్ణ ఉన్నారు.
Prajavartha Online Telugu News