Breaking News

ఏస్పా భారత్ సర్వసభ్య సమావేశం


కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కానూరు నందు ఏస్పా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని ఆక్యు పంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆదివారం విజయవాడ కానూరు ఇండియన్ ఓం ఆక్యు పంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్  నందు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలో సాంప్రదాయ వైద్యంతో పాటు దీర్ఘకాలిక రోగాలు రుగ్మతలు నివారించడానికి మరియు రోగులు రోగాలు లేని భారత్ వైద్య విధానం అభివృద్ధి చెందాలంటే ప్రజలు చైతన్యం కావాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏస్పా జాతీయ కార్యదర్శి  డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు.  అనంతరం జాతీయ కార్యవర్గ ఎన్నిక జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ పేరులో ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేరును మారుస్తూ ఆక్యుపంచర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ గా సభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో అక్యుపంచర్స్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అలవాల రవి, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ మాకాల సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షులుగా ఆర్య రాజకుమారి, జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ తాంబరనేని అనిల్ ,జాయింట్ సెక్రటరీగా గాండ్ల పుష్పలత ,ఇండ్లే కృష్ణ ,శెట్టిపల్లి చిన్నప్పారావు ,పిట్టల సుమలత, కోశాధికారి వెలగపూడి శ్రీదేవి, డైరెక్టర్ గా కొండవీటి సుమతి, జక్కుల దుర్గాప్రసాద్ ,అంబటి ప్రవళిక లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ నందు విశిష్ట వైద్య సేవలు అందించిన ,డాక్టర్ అలవాల రవి ,ఆర్య రాజకుమారులను సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *