తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోని పోరంకి నుండి నిడమానూరు రోడ్డులోగల పోరంకి 17వ బ్లాక్ శివసదన్ రోడ్డును స్థానికులందరూ కలిసి మట్టి రోడ్డును ఎట్టకేలకు క్రషర్డస్ట్, చిప్స్‌తో పునరుద్దరించుకొనుటకు నడుంబిగించారు. ఈ రోడ్డు మీద వృద్ధులు, పిల్లలు, రాత్రిపూట నడవడానికి, వానాకాలంలో వాహనాలు రావడానికి ఇబ్బందిగా వుండటంతో సిమెంట్ రోడ్డు కోసం స్థానిక అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్ని సార్లు విన్నవించినా స్పందించకపోవడంతో తామే అందరూ కలిసి స్వంత ఖర్చులతో క్రషర్డస్ట్, చిప్స్‌తో రోడ్డును పునరుద్దరణ చేసుకుంటున్నామని స్థానికులు తెలిపారు.
Prajavartha Online Telugu News