Breaking News

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూర్‌ భాషా దూదేకుల ముస్లీం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఎస్‌.బాజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌ బాబ్జి, రాష్ట్ర కోఆర్డినేటర్‌ షేక్‌ వలి, రాష్ట్ర ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ షేక్‌ నాగూర్‌, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు షేక్‌ మున్ని, రాష్ట్ర ముఖ్య సలహాదారులు సాయిబాబా, రాష్ట్ర యువత అధ్యక్షులు మట్టిపాటి భాష, రాష్ట్ర సోషల్‌ మీడియా దూదేకుల హుస్సేన్‌, అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఎస్‌.బాజీ మాట్లాడుతూ ఏర్పాటు చేసే కమిటీలు సంఘం దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఏర్పాటు చేయాలని అలాగే కుల సంఘ సర్టిఫికెట్‌ జిల్లా అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్‌ మంజూరు చేసే విధంగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కుల సంఘ సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దూదేకుల కులస్తులు ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకుని వచ్చినచో కచ్చితంగా దాన్ని ఎలాంటి సమస్య అయినా పరిష్కారం దిశగా తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఓటుకి డబ్బులు కాకుండా గ్రామంలో అందరూ కలిసి ఖబరస్థాన్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు మూడు రకాలుగా టిసి ఇవ్వడం పైన చర్చించడం అందుకని ప్రభుత్వం స్పందించి కేవలం ఇండియన్‌ ఇస్లాం దూదేకుల మాత్రమే జీవో మంజూరు చేయాలన్నారు. కులాన్ని కించపరుస్తూ తిట్టే వారిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి జీవో వచ్చేలా కృషి చేస్తానన్నారు. కులవృత్తి చేస్తున్న వారికి బ్యాంకు నుంచి రుణ సదుపాయాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులలో, రాష్ట్రస్థాయి క్యాబినెట్‌ పదవులు కేటాయించాలన్నారు. తాము అందరూ కలిసి తీసుకున్న తీర్మానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాదర్‌ వి, ఎన్టీఆర్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్‌ ఖాసింబి, ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ బుడే వివిధ జిల్లాల కార్యవర్గ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *