-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
-తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలో 3వ డివిజన్ గణేష నగర్ కాలనీ లో రూ.39.50 లక్షల అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ భీమిశెట్టి ప్రవలిక మరియు పలువురు కార్పొరేటర్లు లతో కలసి శంఖుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులైన 3 వ డివిజన్ నందు రూ. 39.50 లక్షలతో బి.టి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని అన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన అనేక పనులను మా ప్రభుత్వం వచ్చిన మూడు ఏళ్ల కాలంలో అనేక పనులు చేపట్టి నగరాని అభివృద్ధి పరచుట జరుగుతుందని అన్నారు. రాబోవు రోజులలో నియోజకవర్గ పరిధిలో మిగిలిన అన్ని పనులను కూడా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
అదే విధంగా అవినాష్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నవని, ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేసి వాటిని వదిలి వేయకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి లక్ష్మo నగరాభివృద్ధి పరస్తూ, శంఖుస్ధాపనలు చేసి వాటిని అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని వివరించారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటతో పాటుగా చిన్న పిల్లలను ఆకర్షించే పార్క్ లను ఆధునీకరించుట జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ డివిజన్ లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు ఈ రోడ్లు అవసరం గురుంచి మా దృష్టికి తీసుకురాగా తక్షణమే కౌన్సిల్ లో పెట్టి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. నగర ప్రజలందరూ కచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్స్ తీసుకోవలని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవలిక, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, డివిజన్ అధ్యక్షలు టీపీ రెడ్డి మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News