మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 4వ తేదీన బందరు నియోజకవర్గానికి సంబంధించి మచిలీపట్నం లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం, శుక్రవారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. ఆ ప్రకారం ఈనెల 4వ తేదీన బందరు నియోజకవర్గానికి సంబంధించి మచిలీపట్నంలో జడ్పీ మీటింగ్ హాలులో ఉదయం 10:30 గంటలకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజున జిల్లా కలెక్టర్ తో సహా జిల్లా అధికారులందరూ పాల్గొని ప్రజల నుండి మధ్యాహ్నం వరకు అర్జీలు స్వీకరించి అనంతరం జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి వారి శాఖలకు సంబంధించిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలిసేందుకు వీలుగా మండలంలో దండోరా, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవలసినదిగా సంబంధిత మండల అధికారులకు కలెక్టర్ సూచించారు. కావున బందరు మండలంలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Tags machilipatnam
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News