మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నదని, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ జిల్లాల్లో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమానికి సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహణ -తీసుకున్న చర్యలు, ఫారం-6, 7, 8 పెండెన్సీ , ఎనామలీస్ వెరిఫికేషన్, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుల జనరేషన్, తొలగించిన ఓట్ల రివెరిఫికేషన్, అనర్హ ఓటర్ల వెరిఫికేషన్ పై వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధుల ఫిర్యాదులు వాటిపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు.
కలెక్టర్ బంగ్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పురోగతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో జరుగుతున్న ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం సంబంధించి ఇంటింటి వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. ఓటర్ల జాబితాల ఇంటింటి వెరిఫికేషన్ లో ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి, అట్టి వారి నుండి ఫారం- 6 సేకరించి ఓటరుగా నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు, మరణించిన ఓటర్ల ను తొలగించుటకు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫారం 6, ఫారం-7, ఫారం-8 ప్రస్తుత పరిష్కార స్థితి వివరించారు. ఫోటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణ కార్యక్రమంలో అనర్హత ఓటర్ల వెరిఫికేషన్ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న పరిష్కార చర్యలు గురించి కలెక్టర్ వివరించారు.
ముడ వి సి రాజ్యలక్ష్మి (పెడన నియోజకవర్గ ఇఆర్వో ) కలెక్టర్ తో పాటు పాల్గొనగా, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ లు, ఏ ఈ ఆర్ వో లు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News