విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి వి.విజయ్ కుమార్ రెడ్డి ఈరోజు అనగా 03 అక్టోబర్ 2023 వ తేదీన సర్కిల్-1 ఆఫీసు నందు మొబైల్ కోర్టు నిర్వహించడం జరిగినది. దీనిలో సర్కిల్-1 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొని చెత్త రోడ్లపై వేసేవారు, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టేవారు, రోడ్ల పైన పెంపుడు జంతువుల్ని వుంచు వారు మరియు లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించుచున్న వారిపై కేసులు పెట్టి మొత్తం 17 మంది పైన మొబైల్ కోర్టులో చార్జి సీటు దాఖలు చేసి 5,720 రూపాయలు అపరాద రుసుము కింద వసూలు చేసినారు. మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి వారికి కౌన్సిలింగ్ ను నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్-1, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News