Breaking News

ఘనంగా ‘ది విజయవాడ చిన్న కార్ల వర్కర్స్ యూనియన్’ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవములు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘ది విజయవాడ చిన్న కార్ల వర్కర్స్ యూనియన్’ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్, అలంకార్ ధర్నాచౌక్  సెంటర్ పక్కన గణపతి మహోత్సవములు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం అన్న ప్రసాద కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ… గత 50 సంవత్సరాలుగా ఈ గణపతి మహోత్సవములు నిర్వహిస్తున్నామని, ఆ విఘ్నేశ్వరుడు కృపా కటాక్షాల వలన ది విజయవాడ చిన్న కార్లు వర్కర్స్ యూనియన్ సహకారంతో ప్రతి సంవత్సరం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. శ్రీ విఘ్నేశ్వరుడు ప్రజలందరికి, అష్ట ఐశ్వర్యాలు కలుగజేయాలని, సిరిసంపదలతో ఉండాలని ఈ సందర్భంగా మా యూనియన్ తరపున మేము అందరం కోరుకుంటున్నామని అన్నారు. ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశామని, దాదాపు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *