Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నగర ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నగర ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం జరుగుతుందని, డివిజన్ల వారిగా జరిగే సురక్ష క్యాంప్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బొంగరాలబీడు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను ఎంఎల్ఏ మహ్మద్ ముస్తఫా, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి, ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నగరంలో ఇంటిలో ఎవ్వరూ అనారోగ్యంగా ఉన్నా వారికీ మెరుగైన వైద్యం అందే వీలుందని, ఇప్పటికే వార్డ్ సచివాలయం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సురక్ష క్యాంప్ పై అవగాహన కల్గించడం, అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. క్యాంప్ లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు, ప్రతి కౌంటర్ వద్ద సమాచారం కోసం వార్డ్ సచివాలయ కార్యదర్శిని నియంమిచామన్నారు. మందులు ఇచ్చేందుకు కూడా తగిన కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ ఫారాలు ఇచ్చామని, క్యాంప్ లో కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి తగిన వైద్య పరీక్షలు చేస్తున్నారని, ఎవరికైనా ఉన్నత వైద్యం అవసరమైతే ప్రభుత్వ లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. క్యాంప్ లో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ తో పాటుగా ఇద్దరు ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. క్యాంప్ ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని, క్యాంప్ లో డిప్యూటీ కమిషనర్లు, ఎంహెచ్ఓ, ప్రజారోగ్య అధికారులు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఎదురైనా వారిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ పేద ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ లో కూడా గతం కంటే ఎక్కువ వ్యాధులకు చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. నగరంలో 29 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని, జగనన్న సురక్ష క్యాంప్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ. కోటేశ్వరరావు, మేనేజర్ శివన్నారాయణ, కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *