గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగవంతం, కాంట్రాక్టర్ ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు కాంట్రాక్టర్లతో మీట్ ది కమిషనర్ కార్యక్రమం చేపడుతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో నగరంలోని కాంట్రాక్టర్లు తాము చేస్తున్న అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నగరంలో వర్క్ ఆర్డర్ పొంది, జరుగుతున్న పనుల పురోగతిపై వివరాలు అడిగి తెల్సుసుకొని, పనుల్లో నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా నగరాభివృద్ధికి సహకరించాలన్నారు. నగరాభివృద్ధిలో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు రెండు కళ్ళు వంటి వారని, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, బిల్లుల చెల్లింపులో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఉదయం ప్రత్యేక సమయం కేటాయించడం జరిగిందన్నారు. ఈ సమయంలో కాంట్రాక్టర్ లు తమ సమస్యలని నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. పనులు పూర్తి అయిన వాటికి ఎంబుక్ చెక్ మెజర్మెంట్ వెంటనే రికార్డ్ చేసి, ఆన్ లైన్ లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను ఏఈ స్థాయి నుండి ఎస్.ఈ. వరకు 3 రోజుల్లో క్లియర్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు డెడ్ లైన్ విధించామని స్పష్టం చేశారు. పనులు పూర్తి అయ్యి ఎంబుక్ చెక్ మెజర్మెంట్ లో సమస్యలు ఉన్న యెడల నేరుగా తమ దృష్టికి తీసుకురావలన్నారు. సిఫార్స్ చేసిన ఫైల్ కి సంబందించిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబందించి థర్డ్ పార్టి క్వాలిటి కంట్రోల్ వారి ఆమోదపత్రం విధిగా ఉండాలన్నారు. కమిషనర్ లాగిన్ లో ఉన్న ఫైల్స్ ని కూడా 3 రోజుల్లో అకౌంట్స్ విభాగానికి పంపుతామన్నారు. ఇక నుండి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, అకౌంట్స్, ఆడిట్, కాంట్రాక్టర్లతో వాట్స్ అప్ గ్రూప్ ని ఏర్పాటు చేస్తున్నామని, గ్రూప్ లో ఎవరైనా ఆయా సమస్యలు పోస్ట్ చేయడం ద్వారా సంబందిత అధికారులు పరిష్కారం చేయడం జరుగుతుందని, వాట్స్అప్ గ్రూప్ సమస్యల పరిష్కార సమన్వయకర్తగా ఉంటుందని తెలిపారు.
Prajavartha Online Telugu News