రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటరు జాబితా హేతుబద్ధీకరణ చేసే విధానం లో 1,99, 703 ఫారం 6, 7, 8 స్వీకరించి 1,84,614 పరిష్కరించగా, ఇంకా 15,089 పరిశీలనలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఓటరు జాబితా, పెండింగ్ దరఖాస్తులు, ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్ష చెయ్యగా , స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డిఆర్వో జి. నరసింహులు, నియోజక వర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు , ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ తొలగింపుపై రాజకీయ పార్టీలు మరణించిన , చిరునామా మార్పు, బహుళ నమోదు పై చేసిన ఫిర్యాదులకు చెందిన 13,750 లకు గాను 5,773 మరని చినట్లు , 716 చిరునామా మార్పు, 572 బహుళ నమోదు, 5987 ఓటర్లు ఉన్నాట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆమేరకు నూరుశాతం పరిశీలన పూర్తి చేశామన్నారు. జిల్లాలో 15,63,984 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
ఏప్రిల్ 15 , 2023 తరువాత ఓటర్లు గుర్తింపు నమోదు, తొలగింపు విధానంలో ఫారం 6 లు 44,490 స్వీకరించడం జరిగిందని, వెబ్ సైట్ లో 37,477 నమోదు చేయగా, 2,471 తిరస్కరించినట్లు, 4,542 పరిశీలనలో ఉన్నాయన్నారు. ఫారం 7 లో 45,106 స్వీకరించడం జరిగిందని, వెబ్ సైట్ లో 37,177 నమోదు చేసినట్లు, 2,786 తిరస్కరించగా, 5,143 పరిశీలనలో ఉన్నాయన్నారు. ఫారం 8 లో 1,10,107 స్వీకరించడం జరిగిందని, 1,02,463 వెబ్ సైట్ లోనమోదు చేసినట్లు, 2,240 తిరస్కరించగా, 5,404 పరిశీలనలో ఉన్నాయన్నారు. అనంతరం నియోజక వర్గ ఎలక్టోరల్ నమోదు అధికారులు లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ లో 15,089 ఫారం లలో ఫారం 6 కి చెందినవి 4542, ఫారం 7 కి చెందినవి 5,143, ఫారం 8 కి చెందినవి 5,404 లు ఉన్నాయని, బీఎల్వో వారిగా వాటిని హేతుబద్ధీకరణ, జవాబుదారీతనం తో పరిష్కారం చెయ్యలన్నారు.క్షేత్ర స్థాయిలో నియోజక వర్గ ఈ ఆర్ ఓ లు అత్యంత బాధ్యత కలిగి విధులను నిర్వర్తించాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కె. దినేష్ కుమార్, డిఆర్వో జీ. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు రాజమండ్రి రూరల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. సరళా వందనం, రాజానగరం – రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి, అనపర్తి – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, తహసిల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News