-స్పందించిన కలెక్టర్ మాధవీలత
-ప్రాథమిక విద్యార్థులకు బొమ్మూరులోనే భోధన
-కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన పేరెంట్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఒకటి నుంచి 5 వ తరగతి విద్యార్థులకు బొమ్మూరు శ్రీ చైతన్య స్కూల్ లోనే తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ ఛాంబర్ బొమ్ము రు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల తల్లితండ్రులు కలిసి అర్జిని అందచేశారు.
సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని, మీ పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఇక్కడే తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐతే ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి పిల్లలకి బొమ్మూరు స్కూల్ లోనే తరగతులు నిర్వహించడం కోసం యాజమాన్యానికి ఆదేశాల ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అయితే 6 వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్ కు వెళ్లాలని సూచించారు. బోధన చేపట్టేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మా పిల్లలకు న్యాయం చేయండి అని శ్రీ చైతన్య స్కూల్ తల్లి తండ్రులు కోరిన వెంటనే కలెక్టర్ స్పందించిన తీరుపై కలెక్టర్ కు పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలలోకి వెళితే గత 32 రోజుల క్రితం బొమ్ము రు శ్రీ చైతన్య స్కూల్ మూతపడింది. న్యాయం చేయమని తల్లి తండ్రులు యాజమాన్యాన్ని వేడుకున్న పట్టించుకొలేదు. మోరంపుడి బ్రాంచి లో బొమ్మూరు బ్రాంచ్ పిల్లలకి క్లాస్ ఏర్పాటు చేస్తామని యాజమాన్యం వాళ్ళు చెప్పారు. తల్లితండ్రులు మంగళవారం అక్కడుకు పిల్లలు తీసుకువెళ్ళారు. అక్కడ అంత మంది విద్యార్థులకు సరిపడే సదుపాయం లేకపోవడం, చిన్న పిల్లల్ని అంతదూరం పంపడం ఇబ్బంది అని కలెక్టర్ కు అర్జి ఇచ్చారు. మంగళవారం విద్యార్థుల తల్లి తండ్రులు కలిశారు. కలెక్టర్ నీ కలిసిన వారి లో ఎస్.రాజీవ్, హేమ, ఆది తదితరులు వున్నారు.
Prajavartha Online Telugu News