Breaking News

ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 27న ఎన్నికల సంఘం విడుదల చేస్తుంధి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 27న ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని, అందుకు సంబందించి బిఎల్ఓల దగ్గర ఉన్న ఓటర్ దరఖాస్తులు, క్లెయిమ్స్ ని వెంటనే పరిష్కరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నెల 27కి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల కానున్నదని, నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారాలు ఏమైనా ఆన్ లైన్ చేయకుండా పెండింగ్ ఉంటె వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో అప్రమత్తంగా నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పెండింగ్ ఫారాల ఆన్ లైన్ వేగంగా జరిగేలా సూపర్వైజరి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ శివన్నారాయణ, సూపరిండెంట్లు సాంబశివరావు, ప్రసాద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *