రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశానుసారం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి బొమ్మూరు లోని జి.పి.ఆర్. ఉన్నత పాఠశాలను సందర్శించారు. మంగళవారం నాడు పాఠశాలలో జరిగిన దుర్ఘటన గురించి విద్యార్ధులను, ప్రధానోపాధ్యాయు రాలిని, ఇతర ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్ధుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం విద్యార్ధులతో మాట్లాడుతూ వారికి కానీ, వారి తోటి విద్యార్ధులకు కానీ ఆపద కలిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సమయంలో పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించారు. వారి హక్కుల పరిరక్షణ కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలున్నా ఈ సంస్థను సంప్రదించాలని తెలిపారు. అనంతరం అస్వస్థతకు గురైన బాలికను ఆమె తల్లిదండ్రులను కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. వైద్య సహాయంతో పాటు ఈ విషయానికి సంబంధించి తగు చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు రిపోర్ట్ పంపించడం జరుగుతుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News