Breaking News

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, గృహ సారథులు తీసుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2, 3, 5, 6, 7, 8, 19 డివిజన్ లకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహ సారథులు, బూత్ ఏజెంట్స్,కార్యకర్తలతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి (వై ఏపి నీడ్స్ వైయస్ జగన్) కార్యక్రమం వీధివిధానాలాను వివరించి కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి, గతంలో ఎవరూ చేయలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే అని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఖండించాలని హితబోధ చేశారు. మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన కొనసాగుతుంది అని లేకపోతే రాష్ట్రం మరలా వెనక్కు వెళ్లడం ఖాయమని కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు అందరం కలిసికట్టుగా పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందింద్ధమని అవినాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,కార్పొరేటర్లు నిర్మలా కుమారి,ప్రవల్లిక,అంబేద్కర్, అమర్నాధ్,మాధురి, రహేన, కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, అలీమ్,వైసీపీ నాయకులు జగ్గా, విజయ్, ప్రభు ఉదయ్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *