Breaking News

పేదల జీవితాల్లో వెలుగే లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-26 వ డివిజన్ 30 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 26 వ డివిజన్ 30 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ఆయన పాల్గొన్నారు. గోగినేని వారి వీధి నుంచి పాదయాత్ర ప్రారంభించి.. ఆంధ్రాబ్యాంకు రోడ్డు, వీఎస్ఎన్ కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. 204 కుటుంబాలతో మమేకమై యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏ పథకం రావాలన్నా నిరుపేదలు జన్మభూమి కమిటీల వద్ద పైరవీలు చేయాల్సి వచ్చేదని మల్లాది విష్ణు గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో సచివాలయ పరిధిలోని 1,119 కుటుంబాలకు అక్షరాలా 7 కోట్ల 94 లక్షల 6 వేల 381 రూపాయల సంక్షేమాన్ని అందించినట్లు చెప్పారు. నిరుపేదలకు విద్య, వైద్య రంగాలను దరి చేర్చడంతో పాటు, లక్షలాది మహిళలకు సొంతింటి కలను నిజం చేశారన్నారు.

పవన్ బహిరంగ చర్చకు సిద్ధమా..?
రహదారుల గూర్చి మాట్లాడే నైతిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమాత్రం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో డబుల్ స్పీడ్ తో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. టీడీపీ హయాంలో రోడ్లకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదని.. ఈ ప్రభుత్వంలో రహదారులన్నింటినీ నవీకరించడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతు పనులకు ఖర్చు చేసింది రూ. 2,954 కోట్లు కాగా.. ఈ ప్రభుత్వం రెండేళ్లు కరోనా ఉన్నా నాలుగేళ్లలో రోడ్ల పునరుద్ధరణకు ఖర్చు చేసింది అక్షరాల రూ. 4,149 కోట్లు అని వెల్లడించారు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2,400 కోట్లతో 7,500 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో రోడ్లు వేస్తామంటూ బ్యాంకుల నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకువచ్చి.. రోడ్లు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తుచేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో..? నాలుగేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో బహిరంగ చర్చకు రావాలన్నారు. అంతేగానీ ఎల్లో మీడియా సహకారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలియజేశారు.

పవన్ ది మిడిమిడి జ్ఞానం
సనాతన ధర్మం గూర్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలో కాదా..? సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం హయాంలో చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లిన దారుణ సంఘటనలు జరిగినప్పుడు జనసేన అధినేత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాలలో చివరకు వాటర్ ప్యాకెట్స్ లో కూడా అవినీతికి పాల్పడి.. రూ. 3 వేల కోట్లు దోచుకుతిన్నారన్నారు. తెలుగుదేశం అవినీతి ప్రభుత్వమని ఆనాడు జనసేన అధినేత మాట్లాడలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలయాల పవిత్రతను, లక్షలాది భక్తుల ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు వెళుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో 2016 కృష్ణా పుష్కరాల సమయంలో 23 దేవాలయాలను కూల్చివేయగా.. ఈ ప్రభుత్వంలో రూ. 4.39 కోట్ల నిధులతో వాటన్నింటినీ పున: నిర్మించినట్లు తెలిపారు. సీజీఎఫ్ నిధుల ద్వారా నాలుగేళ్లలో 757 ఆలయాల అభివృద్ధి కోసం రూ. 488.76 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద 2019 నాటికి రాష్ట్రంలో 1,652 దేవాలయాలకు మాత్రమే సహాయం అందుతుండగా.. ప్రస్తుతం 4,751 దేవాలయాలకు అందుతున్నట్లు వెల్లడించారు. కానీ సనాతన ధర్మంపై కనీస అవగాహన, గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజలు పట్టం కట్టంబోతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో డీఈ(వాటర్ & యూజీడీ) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల వంశీ, నాయకులు కోలా నాగాంజనేయులు, పసుపులేటి కోటేశ్వరరావు, బాడిత అప్పారావు, పారా ప్రసాద్, మోబిన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *