Breaking News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే జగనన్న లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఇందిరానాయక్ నగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం మునుపెన్నడూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ఏ కార్యక్రమమైనా.. లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరుతుందని ఆరోగ్య సురక్ష ద్వారా మరోసారి రుజువైందన్నారు. 58వ డివిజన్లోని 8 వార్డు సచివాలయాల పరిధిలో 9,378 గృహాలు ఉండగా.. 9,017 ఇళ్లను వైద్య సిబ్బంది సందర్శించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 5,027 మంది 7 రకాల పరీక్షలు నిర్వహించడం ద్వారా.. 2,214 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించి టోకెన్లు అందజేసినట్లు చెప్పారు. వీరికి మరలా వైద్య శిబిరంలో ఉన్నత వైద్యుల చేత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనారోగ్యంతో తీవ్రంగా దెబ్బతిన్న రోగులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు వైద్యులు స్వయంగా తీసుకువెళ్లి.. వారికి సరైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 1,69,376 లక్షల కుటుంబాలకుగానూ.. ఇప్పటివరకు 71,982 కుటుంబాలకు రూ. 160 కోట్లతో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించినట్లు మల్లాది విష్ణు గుర్తుచేశారు. అలాగే ప్రతిఒక్క డివిజన్లో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ద్వారా.. దాదాపు లక్ష మందికి వైద్య సేవలు ఉచితంగా అందుతాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి.. దేశంలో మరే ప్రభుత్వం సాటిరాదని స్పష్టం చేశారు. అనంతరం రోగులకు మందులతో కూడిన మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సీఎంఓహెచ్ రత్నావళి, డిప్యూటీ డీఎంఓహెచ్ ఇందుమతి, జోనల్ కమిషనర్ మాల్యాద్రి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *