Breaking News

పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 7,8 డివిజన్ లలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లను ప్రారంభించిన అవినాష్ అందిస్తున్న వైద్య సేవలు గురుంచి సిబ్బందిని అడిగి తెలుసుకుని, ప్రజలంతా వైద్య సేవలు చేపించుకోనెలా వైసీపీ నాయకులు వారికి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైద్యం చాలా ఖరీదు అయిన ప్రస్తుత రోజుల్లో పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలని ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరించడంతో పాటు ఆరోగ్య సురక్ష ద్వారా షుగర్, బీపీ, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుని వారికి అవసరమైన వైద్య చికిత్స ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కి రాని ఈ ఆలోచన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా చేసాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏనాడైనా ప్రజల గురించి, వారి బాగోగులు గురుంచి ఈ విధంగా పట్టుంచుకొన్నార అని అవినాష్ ప్రశ్నించారు. సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్కరోజు లోనే దాదాపు 90 లక్షల మందికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన ప్రభుత్వం అదే స్ఫూర్తితో చేపట్టిన ఈ ఆరోగ్య సురక్ష ను ప్రజలందరూ వినియోగించుకోవాలని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డాక్టర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మెహబూబ్,7వ డివిజన్ కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి,8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్,వి.ఎమ్.సి అధికారులు సత్యవతి,కృష్ణ,వైసీపీ నాయకులు జైహింద్ రావు,రవి,సంపత్,కుటుంబ రావు,ధనరాజ్,రాజ్ కమల్,సుమన్ మరియు వైద్య అధికారులు,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *