Breaking News

సామాజిక సమస్యలకు పరిష్కారంతోపాటు నడుఅటున్న ఉద్యమాల వాయిస్ కూడా వినిపించిన గ్రంధం ‘ప్రేరణ’ అని అభ్యుదయ రచయితల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సమస్యలకు పరిష్కారంతోపాటు నడుఅటున్న ఉద్యమాల వాయిస్ కూడా వినిపించిన గ్రంధం ‘ప్రేరణ’ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక బందరురోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు పై పీఠికలు, విశ్లేషణల వ్యాస సంకలనం ‘ప్రేరణ’ పరిచయ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కవికి దొరికిన ప్రధమ శ్రోత అర్ధాంగి అని,మనిశాంతా స్నేహమైనవాడు విల్సన్ రావు అని ఆయన అన్నారు. సభకు ఓ యస్ డి టూ గవర్నమెంట్ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, సుప్రసిద్ధ రచయిత డా. ఎం.ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ప్రేరణ పుస్తకాన్ని కవి  భార్య  కొమ్మవరపు రాజామణి కి అంకితమిచ్చారు. తొలి కాపీని చిరంజీవి సుధాకర్ కు అందజేశారు. పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షులు ప్రసిద్ధ కవి అరసవిల్లి కృష్ణ సమీక్షించారు. పుస్తక రచయిత కొమ్మవరపు విల్సన్ రావు కవి స్పందన తెలియజేయగా సభలో సీనియర్ జర్నలిస్టు అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు మాట్లాడారు. పుస్తకంలో వ్యాసాలు రాసిన అనిల్ డ్యాని, ఘంటా విజయ్ కుమార్, మందరపు హైమవతి, విష్ణుభొట్ల రామకృష్ణ, కె.విరమణమూర్తిలను సత్కరించారు. తొలుత మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ కార్యక్రమ ఉద్దేశాన్ని చెప్పి, అతిధుల్ని వేదికపైకి ఆహ్వానించారు. సభానంతరం కవి సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితల్ని వినిపించారు. పాల్గొన్న కవులందరికీ ఆత్మీయ సత్కారం చేశారు నిర్వాహకులు. కార్యక్రమాన్ని మల్లెతీగ ఉపాధ్యక్షులు చొప్పా రాఘవేంద్రశేఖర్ నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *