విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్డు భద్రతా చర్యలతో పాటు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన రీజినల్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ఎన్. శివరామ ప్రసాద్ ను కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. రవాణా శాఖలో రీజినల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్. శివరామ ప్రసాద్ సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకునేందుకు జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ , జాతీయ రహదారులు, నగర పాలక సంస్థ తదితర శాఖల సమన్వయంతో గతంలో గుర్తించిన ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) మరియొక సారి నిశితంగా పరిశీలించి ప్రమాదాల నివారణకు చేప్పట్టవలసి చర్యలు తీసుకొని జిల్లాను ప్రమాదల రహిత జిల్లాగ తీర్చిదిద్దెందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. 1990 లో సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారిగా చిత్తూరు జిల్లాలో ఉద్యోగం లో చేరిన శివరామ ప్రసాద్ 1998లో మోటర్ వాహన తనిఖీ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతిలో పని చేసి 2005 లో ఆర్టీవో గా రవాణాశాఖ కమీషనర్ కార్యాలయంలో సేవలందించి అనంతరం కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల డిటిసిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ప్రభుత్వం రీజినల్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ విజయవాడ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన సోమవారం నుండి ఆర్ జె సి గా విధుల్లో చేరారు.
Prajavartha Online Telugu News