Breaking News

ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కనపరిచేలా రైతులను ప్రోత్సహించాలి…. : జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో 12 సెంట్లలో కూరగాయలు, దుంప, తీగజాతి రకానికి చెందిన నిరంతర పంటలను పండిరచే ఎనీ టైమ్‌ మనీ (ఎటియం) మోడల్‌ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌లు మొక్కలను నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు సంవత్సరం అంతా (365 రోజులు) ఆదాయం వచ్చే విధంగా వివిధ పంటలను పండిరచే విధానం ద్వారా రైతులకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 20 వేల మంది రైతులతో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 34 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేసేలా లక్ష్యాన్ని నిర్థేశించుకున్నామన్నారు. రసాయనిక ఎరువులకు స్వస్థి పలికి రైతులు ప్రకృతి వ్యవసాయం బాట పట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహాకాల లబ్ది చేకూరుస్తు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు సాగు చేసి లాభాలను ఆర్జించేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వర్షపాతం ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ప్రకృతి వైపరిత్యాలు, చీడపీడల వలన పంట నష్టపోయి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వనరులు, చీట పీడలను తట్టుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపిస్తున్నారని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. గంపలగూడెంకు చెందిన రైతు కోటేశ్వరమ్మ తాను ఎకరంన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పత్తి పంటను అంతర పంటగా పండిస్తున్నానని తరచు పత్తి పంటకు ఆశించి నష్టం కలిగించే గులాభి రంగు పురుగు బారిన పడకుండా రక్షించగలుగుతున్నానని తెలిపారు. ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రకృతి వైపరిత్యాల నుండి తట్టుకుని నిలబడే వివిధ పంటల సాగు పై శిక్షణ తీసుకోవడం జరిగిందని కలెక్టర్‌ డిల్లీరావుకు వివరించారు. కార్యక్రమంలో ఏపిసిఎన్‌ఎఫ్‌ డిపియం విజయకుమారి, డిస్టిక్ట్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఎస్‌ నాగమణెమ్మ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *