విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన ఒక ప్రత్యేక వేదిక అని, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేధిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, ఇన్చార్జ్ డిఆర్వో జి. వెంకటేశ్వర్లులు ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ స్పందనలో సమర్పించే ఆర్జీలకు నిర్థీశించిన గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను తిరిగి నమోదు కాకుడదన్నారు. సమస్యల పరిష్కారానికి స్పందన ఎకైక మార్గమని ఆర్జీదారులు ఎంతో ఆశతో స్పందనలో ఆర్జీలను అందజేస్తుంటారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యకు సరైన పరిష్కారం చూపగలిగిన్నపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. స్పందనలో స్వీకరించిన ప్రతి ఆర్జీకి ఎండార్స్మెంట్ తప్పనిసరిగా అందజేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ పరిష్కారం పై అధికారులు దృష్టి సారించాలని, తరచు రీ ఓపెన్ అవుతున్న ఆర్జీలపై ఆయా శాఖ అధికారులు శ్రద్ద పెట్టాలన్నారు. స్పందనలోనే కాకుండా జగనన్నకు చెబుదాం`1902, అన్లైన్ పోర్టల్లో నమోదు అవుతున్న ఆర్జీలను అధికారులు ప్రతి రోజు పరిశీలించి పరిష్కరించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, స్పందన మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా అర్జీలు నమోదవుతుంటాయన్నారు. ఆఫ్ లైన్, అన్ లైన్లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందనలో వచ్చిన ఆర్జీ 161 నమోదు కాగా వీటిలో రెవెన్యూ 94, పోలీస్ 21, యంఎయుడి 11, డిఆర్డిఏ 6, విద్య 5, పౌరసరఫరాలు 4, ఏపిసిపిడిసిఎల్ 4, హెల్త్ 3, పశుసంవర్థక శాఖ 2, పంచాయతీరాజ్ 2, సర్వే అండ్ సెటిలిమెంట్ 2, సోషల్ వెల్ఫేర్ 2, హౌసింగ్ 1, వ్యవసాయ 1, ఆర్డబ్ల్యుఎస్ 1, రవాణా 1, ఏపిఎస్ ఏపిఎస్డబ్ల్యుఆర్ఇఐఎస్్ 1 ఆర్జీలు నమోదు అయ్యాయన్నారు. జిల్లాలోని డివిజన్ అధికారులు, ఆయా మండల యంపిడివోలు, తహాశీల్థార్లు, మున్సిపల్ కమీషనర్లతో పరిష్కారమయ్యే వినతులు వర్చువల్గా కలెక్టర్ డిల్లీరావు అక్కడికక్కడే పరిష్కరించారు. స్పందన కార్యక్రమంలో డిఆర్డిఏ పీిడి కె.శ్రీనివాస్, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యం విజయభారతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి యం. రుక్మాంగదయ్య, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, ఆర్అండ్బి ఎస్ఇ వి.కె. విజయశ్రీ, ఇరిగేషన్ ఎస్ఇ విష్ణుమోహన్రావు, ఎల్డియం కె. ప్రియాంక, డ్వామా పిడి జె. సునీత, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News