Breaking News

అంబేద్కర్ విగ్రహ స్మృతి వనం లో సుందరీకరణ పనులు పరిశీలన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్  పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్మృతి వనం నిర్మాణం జరుగుతున్న పనులను సోమవారం ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ పరిశీలించారు. అభివృద్ధి మరియు గ్రీనరి పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్రస్థాయి లో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహ స్మృతి వనం నందులి ఎగ్జిబిషన్, ఆడిటోరియం హాల్, ప్రవేశద్వారము, పురోగతిలో ఉన్న గ్రీనరీ మొదలగు పనులను పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని సందర్భంలో ఆకర్షణీయంగా పచ్చదనాన్ని పెంపొందించాలని చేపట్టిన అన్ని పనులు నిర్దేశిత గడుపులోనే పూర్తి చేసినట్లుగా చూడాలని ఆదేశించారు .ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న శిలాఫలకమును కూడా పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. జరుగుచున్న నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం పనుల పరిశీలించిన లో క్వాలిటీ కంట్రోల్ అధికారులు, కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *