-ప్రజాహిత శిబిరాలను నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున కృతజ్ఞతలు – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాట్లలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 50వ డివిజన్ కే.బి.యన్ కాలేజ్ నందు సోమవారం నాడు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నీ మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్యాన్ని అందిస్తున్నాం అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతుందన్నారు.ప్రజలు అందరు సద్వినియొగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఆశయాల మేరకు ఆరోగ్య సురక్ష ద్వార అందరు ఆరోగ్యంగా ఉండాలని, అక్కడున్న ప్రజలు చాలా వరకు కొండ ప్రాంతం వారు కాబట్టి వాళ్లకి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు, మందులు కానీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందుబాటులో పెట్టడం, హై క్వాలిఫైడ్ డాక్టర్లచే ఆరోగ్య సమస్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రజలు ఉన్నచోటే ఇటువంటి ఆరోగ్య శిబిరాల ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ చేయడం. ఇటువంటి ప్రజాహిత శిబిరాలను నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున మేయర్ కృతజ్ఞతలు తెలిపారు
50వ డివిజన్లో కేబీఎన్ కాలేజీలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాట్లలో, నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ గారు పరిశీలించి అక్కడున్న అధికారులకు చెప్పారు కేబీఎన్ కాలేజీలో జరిగిన ఈ శిబిరంలో 1226 ఓపీలు నమోదు అయినట్టు అక్కడ అధికారులు తెలుపగా కమిషనర్ గారు ఈ శిబిరంలో 170, 175, 176, 177 సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలంతా ఈ ఈ శిబిరంలో పాల్గొన్నందుకు తన సంతృప్తిని వ్యక్తపరిచారు. ఇంకా ఎవరైనా ఇటువంటి ఆరోగ్య శిబిరాల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్న పాల్గొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు.
50వ డివిజన్ వైకాపా ఇంఛార్జి బంక విజయ,50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు,జిల్లా వైద్య శాఖ అధికారి సుహాసిని,సిఎంహెచ్వో రత్నావళి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులూ కార్యకర్తలు అభిమానులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News