Breaking News

ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యమే కీలకం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-రూ. 15.35 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయానికి భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యం అత్యంత కీలకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26వ డివిజన్ మాచవరం డౌన్ నార్ల వారి వీధిలో రూ. 15.35 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాలతో డివిజన్లన్నీ సంపూర్ణ ఆరోగ్యకర ప్రాంతాలుగా విరజిల్లుతున్నాయన్నారు. నగరంలోని ఆసుపత్రులు, కార్యాలయాలు, రహదారులు ఇలా అన్నిరకాల పరిసరాలను రేయింబవళ్లు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 1,300 మంది పారిశుద్ధ్య కార్మికులు, 21 మంది శానిటరీ ఇన్స్ పెక్టర్లు, ఇద్దరు ఏఎంఓహెచ్ లు విధులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్యాలయాలకు సైతం మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈ వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, కోలా నాగాంజనేయులు, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *