విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేస్తూ ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. బుధవారం 7వ డివిజన్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అవినాష్ ప్రారబించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండలని దేశంలో ఎవరూ చేయనివిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష అని బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. కంటి చూపు సమస్యలతో వచ్చిన ముసలివారికి కంటి పరీక్షలు చేసి కళ్ళజోడు అవసరమైన వారికి నేరుగా ఇంటి వద్దకే ఉచితంగా అందజేస్తున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన మేరకు ఆరోగ్య శ్రీ నెటీవర్క్ హాస్పిటల్ కు రెఫెర్ చేసి మెరుగైన వైద్యం, ఆపేరేషన్ లు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు సంపూర్ణ ఆరోగ్యముతో తిరిగి వచ్చేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో పెన్షన్లు తీసుకోవాలి అంటే కొండ దిగి కిందకు వచ్చి కార్యాలయాల చుట్టూ తిరిగితే గాని వచ్చేది కాదు అని, ఏదైనా సంక్షేమ పథకాలు కావాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి వారికి ఓట్లు వేస్తాం అంటేనే ఇచ్చేవారు అని విమర్శించారు. కానీ నేడు వలంటీర్ లు నేరుగా మీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. అంతేగాని ఏ వలంటీర్ కూడా మా పార్టీ జెండా మోయమని, ఓటెయ్యమని అడగరు అని అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి మంచి మనసు అని, మనందరి మంచి గురుంచి ఆలోచించే జగన్ కి మన ఆశీస్సులు అందించి అండగా ఉంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు కు ఆయన బాటలు వేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా DM&HO సుహాని,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, మండల అధక్షులు బుర్రి జగజ్జీవన్ రామ్,డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి సంపత్ వైసీపీ నాయకులు కుటుంబరావు, క్లైవ్,సుభాషిణి,సొంగా రాజ్ కమల్,కత్తుల సంపత్,సుజాత,శంకర్ మరియు వైద్య అధికారులు, వి.ఎమ్. సి అధికారులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News