విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బాలల దినోత్సవ వేడుకలును విశాఖ పట్నంలో ప్రభుత్వ పరంగా నిర్వహించమని ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు కోరారు.ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ గత నెలలో ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల పర్యటనకు వచ్చినపుడు నవంబర్ 14న జరపబోవు బాలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రభుత్వ పరంగా నిర్వహించాలని కోరామని తెలిపారు.అంతే కాకుండా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష చరణ్ కి,మరియు రెండు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కి వివరించడం జరిగిందనీ తెలిపారు. గత కొన్ని సం.రాలుగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి కారోనా మహమ్మారి వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న నేపద్యంలో ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా ఘనంగా విశాఖ పట్నంలో నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరుపున ముఖ్యమంత్రి కి , సంభందిత శాఖల మంత్రులకు మరియు ఉన్నత అధికారులకు కోరడమైనదనీ చైర్మన్ అప్పారావు తెలిపారు.
Prajavartha Online Telugu News