Breaking News

19 అక్టోబర్, 2023న  వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితా ప్రకటన

– అవార్డుకు ఎంపికైన వారి జాబితా వెల్లడించనున్న కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు మీద భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబడి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను 19 అక్టోబర్, 2023న ప్రకటించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డును అందించడం ఇది వరుసగా మూడో ఏడాది అని ఆయన వెల్లడించారు. సామాన్యుల్లో అసామాన్యులకు మరియు పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారిని గుర్తించి అవార్డులు అందించనున్నామని కమిషనర్ తెలిపారు. కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్ ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను రేపు సాయంత్రం 3 గంటలకు పబ్లిసిటీ సెల్, సెక్రటేరియట్ నందు వెల్లడించనున్నట్లు కమిషనర్ తెలిపారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద గ్రహీతలకు రూ.10 లక్షల నగదు పురస్కారంతో పాటు వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *