Breaking News

ఈవీఎంలు వివిప్యాట్స్ ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎంలు వివిప్యాట్స్ ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి వారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు బుధవారం గొల్లపూడి మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోడౌన్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్సి) ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 16వ తేదీన ప్రారంభమైన ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో 125 బ్యాలెట్ యూనిట్లు (బియులు), 125 కంట్రోల్ యూనిట్లు( సీఈలు), 125 వివిప్యాట్స్, నిర్వహించగా 17వ తేదీన 265 బ్యాలెట్ యూనిట్లు, 265 కంట్రోల్ యూనిట్లు, 265 వి వి ప్యాట్స్ చెకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామన్నారు. 25 రోజులపాటు నిర్వహించే ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతిరోజు పాల్గొని ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు కోరారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ కు సంబంధించిన ఎక్సెల్ షీట్ల సమాచారాన్ని ప్రతిరోజు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 16వ తేదీ నుండి ప్రారంభమైన ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ నవంబర్ 10వ తేది వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఎటువంటి చిన్న పొరపాట్లుకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తున్నామని, మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్పై కెమెరాలు లాంటివి అనుమతించకుండా 20 రోజులపాటు 5,700 ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్సి)లో ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈవీఎం గోడౌన్లలో నిర్వహించే ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన బ్యారికేడింగ్ నిర్వహించి పటిష్ట బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేశామని అన్నారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను ప్రత్యేక మానిటర్ల ద్వారా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ప్రతిరోజు ఈ ప్రక్రియకు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సమావేశంలో డిఆర్వో ఎస్ వి. నాగేశ్వరరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సిహెచ్. దుర్గాప్రసాద్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *