-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జక్కంపూడి ప్రాంతములోని సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) స్థలములలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బుధువారం క్షేత్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ మరియు రూరల్ రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించి అక్కడ (చెత్త) గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నిర్మించడానికి ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. జక్కంపూడి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు అందుబాటులో ఉన్న రెవిన్యూ స్థలము నందు నగరపాలక సంస్థ (చెత్త) గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నిర్మాణము చేపట్టుటకై కలెక్టర్ వారి నుండి అనుమతి పొందుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జక్కంపూడి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వెంబడి ఉన్న స్థలము టౌన్ సర్వేయర్ ద్వారా కొలతలు వేయించి చుట్టుత గోడ (వాల్) నిర్మించి మరియు అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు అవసరమగు అంచనాలు రూపొందించి సమర్పించాలని అన్నారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి (చెత్త) గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నిర్మాణము, ప్రొటెక్షన్ వాల్, గ్రీనరి పనులు చేపట్టుటకు అవసరమగు టెండర్ పనులు చేపట్టి పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్(ప్రాజెక్ట్స్) కె. రామ్ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, టౌన్ ప్లానింగ్, రూరల్ రెవెన్యూ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News