Breaking News

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.

-ముఖ్యమంత్రి పాలనకు అమ్మశక్తి అడుగడుగునా తోడుగా ఉండాలని కోరుకున్నాను.
– రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
-చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని.. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనకు అమ్మ శక్తి అడుగడుగునా తోడుగా ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం మంత్రి వేణుగోపాలకృష్ణ శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారికి హారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ లక్షలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారని.. సామాన్యుడు, సంపన్నుడు అనే తేడా లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోందని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోందని కరుణ కటాక్షాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని చెడును సంస్కరించి మంచి మార్గం వైపు నడిపించేది దసరా అని.. ఆలయ అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ పాలకమండలి భక్తులకు మంచి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *