Breaking News

మూలా నక్షత్రం రోజు విఐపి దర్శనాలు వుండవు

-మూలా నక్షత్రం రోజు వృద్దులు వికలాంగులు అమ్మవారి దర్శనానికి పెట్టుకోవద్దు.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20 వ తేదీ శుక్రవారం కనక దుర్గ అమ్మ వారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు రెండు నుండి రెండున్నర లక్షల మంది భక్తులు అమ్మ వారి దర్శనం కొరకు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మూలా నక్షత్రం రోజు విఐపి అంతరాలయం దర్శనాలను రద్దు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. కొండ పైకి ఎటువంటి వాహనాలను అనుమతించటం లేదని కేవలం క్యూ లైన్ల ద్వారా మాత్రమే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవలసి వుంటుందని తెలిపారు. వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యం తో యిబ్బంది పడే వారు మూలా నక్షత్రం రోజు దర్శనం కొరకు వచ్చి యిబ్బంది పడవలసి వస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని 20 తేదీ శుక్రవారం అనంతరం అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావు ప్రకటనలో కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *