కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వ తేదీ గురువారం సాయంత్రం కంకిపాడులో అయానా హోటల్ & ఫంక్షన్ హాల్ నందు వివాహ ఫంక్షన్ కు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం వెన్యూ వద్ద ఏ ఎస్ ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) సమావేశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత అధికారులతో నిర్వహించారు. ముఖ్యమంత్రి కంకిపాడులో ఫంక్షన్ హాల్ కు చేరుకునే రోడ్డు మార్గం కలెక్టర్ ముందుగా పరిశీలించి రోడ్డు మరమ్మతులు ప్యాచ్ వర్క్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ అధికారులను ఆదేశించారు. ఫంక్షన్ హాల్ ఆవరణ లోనికి ప్రవేశించేందుకు ముఖ్యమంత్రికి వేరే మార్గం ఏర్పాటు చేయగా, ఫంక్షన్ హాల్ లోనికి ముఖ్యమంత్రి ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గం కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఫంక్షన్ హాల్ లో వేదిక కలెక్టర్ పరిశీలించారు. అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు వైద్యులను ఆంబులెన్స్ తో సిద్ధంగా ఉంచాలని డిఎంహెచ్వో కు సూచించారు. సీఎం వచ్చే మార్గం లో అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని పవర్ బ్యాక్అప్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. రహదారులు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ మెరుగుపరచాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.. వివాహానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని అన్నారు అవసరమైన బ్యారీకేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. గుడివాడ శాసనసభ్యులు మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు నాని పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆర్డీవో విజయ్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ పిడి నారాయణరెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి, అగ్నిమాపక ,ఫుడ్ సేఫ్టీ, రవాణా శాఖ విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తాసిల్దారు ప్రసాద్, ఎంపీడీవో అనూష తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News