తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచమంతటా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఎండా, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో జరుపుకునే పండుగకు కూడా అందుబాటులో లేకుండా ప్రజల కోసం జీవించి ప్రాణాలను పణంగా పెట్టి మరణిస్తున్న పోలీసులకు వారి త్యాగాన్ని గుర్తించి మనం ప్రతి ఏటా అక్టోబర్ 21 న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు.
శనివారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో లో జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా డిప్యూటి సి.ఎం , అతిధులుగా జిల్లా కలెక్టర్ కె. వెంకరమణ రెడ్డి, నగరపాలక కమిషనర్ హరిత , తుడ చైర్మన్ మోహిత్ పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు నివాళులర్పించి ప్రసంగించారు.
ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ మన అందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకోవడం మన విధి అని దేశం కోసం త్రుణపాయంగా పోలీసులు ప్రాణాల నర్పిస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం స్మరించు కోవడం అనేది మనం ఇచ్చే గౌరవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని , విధినిర్వహణలో మరణించిన వారికి అందించే పరిహారం, కారుణ్య నియామకం అమలు చేస్తున్నదని , దీనికి తోడుగా హోంగార్డుల సంక్షేమం కోసం ప్రమాదాల్లో మరణించిన వారికి 10 లక్షలు, సర్వీస్ లో ఉన్న హోంగార్డులు సహజంగా మరణించినా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందిస్తూ అండగా ఉందని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధినిర్వహణలో కుటుంబాలను సైతం ప్రక్కనబెట్టి నిరంతరం దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన వారిని స్మరించుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం , ఒక యజ్ఞంగా బావిస్తున్నాను అన్నారు. అమరవీరుల దినోత్సవం లో మనం భాగస్వామ్యులు కావడం , స్మరించుకోవడం , వారికి సంతాపం తెలుపడం మన విధి అన్నారు.
జిల్లా ఎస్ పి పరమేశ్వర రెడ్డి స్వాగత ఉపన్యాసం లో మాట్లాడుతూ దేశంలో పోలీసు అమరవీరుల తమ విధి నిర్వహణలో దేశ భద్రత కోసం పగలనక రాత్రనక శాంతిభద్రతల నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి ప్రతి ఏటా అక్టోబర్ 21 న వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. 1959 అక్టోబర్ 21న కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులలో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో సి. ఆర్. పి. ఎఫ్. దళం దీటుగా ఎదురొడ్డి పోరాడి 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, రక్తంతో తడిసిన నీటి బుగ్గ ప్రాంతం నేడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకున్నదని అన్నారు. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మనదేశంలో 2022 సెప్టెంబర్ మాసం నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు 188 మంది, మన రాష్ట్రంలో 6 మంది అసువులు బాశారు అన్నారు. జిల్లాలో అమరులైన 5 పోలీస్ కుటుంబాల ను ఆదుకోవడం, వారి సంక్షేమం లక్ష్యంగానూ, నిరంతర విధి నిర్వహణ పోలీస్ లకు అండగా వుంటూ, స్నేహపూర్వక పోలీస్ గా ప్రజల శాంతి భద్రతల రక్షణలో భాగస్వాములుగా వుంటామని మాట యిస్తున్నామని తెలిపారు.
అడిషనల్ ఎస్పీ వెంకట్రావు దేశవ్యాప్తంగా అమరులైన 188 మంది పోలీసుల పేర్లను చదువుతూ వారిని స్మరిస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, అశువులు బాసిన పోలీస్ కుటుంబాలతో సహా అందరూ అమర వీరుల స్థూపం వద్ద పూలు సమర్పించి ఘన నివాళులర్పించి, రెండు నిముషాల మౌనం పాటించారు.
కార్యక్రమ ప్రారంభంలో పోలీస్ వందనం స్వీకరించిన ముఖ్య అతిధి డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్, ఎస్ పి లు. అనతరం జిల్లా ఎస్ పి, నగర పాలక సంస్ధ కమిషనర్ హరిత , తుడ ఛైర్మన్ మోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో అతిధులు జిల్లా అధికారులు పాల్గొని అమర వీరుల స్థూపం వద్ద నివాలర్పించి , జిల్లా అమర వీరుల సన్మానంలో పాల్గొన్నారు.
జిల్లాలో అమరులైన మహమ్మద్ రఫీ, వీరాంజనేయులు, మోహన్, రమేష్ నాయక్ , సురేష్ కుమార్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పలకరించి అత్యంత గౌరవం కల్పిస్తూ ప్రజాప్రతినిధుల ప్రక్కన కూర్చే బెట్టి, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.
Prajavartha Online Telugu News