-తిరుపతి జిల్లాలో ఎఫ్ఎల్సి ప్రక్రియ నిబంధనల మేరకు చక్కగా జరుగుతోందని కలెక్టర్ ను అభినందించిన ఈసిఐ ప్రతినిధి ఈవిఎం ఎఫ్ఎల్సి పరిశీలన నోడల్ అధికారి
రేణిగుంట , తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్ వారిచే ఓటింగ్ యంత్రాల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలన కొరకు జిల్లాకు కేటాయించబడిన జాయింట్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, కర్ణాటక మరియు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ పరిశీలనా నోడల్ అధికారి వి. రాఘవేంద్ర గారు, తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. వెంకట రమణ రెడ్డి గారితో కలిసి రేణిగుంట వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్ లో భద్రపరచబడిన ఈవిఎం లను, అక్కడ జరుగుతున్న ఎఫ్.ఎల్.సి. ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు.
శనివారం ఉదయం భారత ఎన్నికల కమిషన్ వారిచే ఈవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలన కొరకు జిల్లాకు కేటాయించబడిన జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, కర్ణాటక మరియు ఈవిఎం ఎఫ్ఎల్సి పరిశీలనా నోడల్ అధికారి జిల్లా కలెక్టర్ తో కలిసి రేణిగుంట వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్ లో భద్రపరచబడిన ఈవిఎం ల ఎఫ్.ఎల్.సి. ప్రక్రియ ను పరిశీలించారు. ఈవిఎం ఎఫ్ ఎల్ సి పరిశీలనా నోడల్ అధికారికి జిల్లా కలెక్టర్ ఎఫ్ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లను వివరించారు. నోడల్ అధికారి వారు బెల్ ఇంజినీర్లతో ఈవిఎం ల పనితీరును తనిఖీ చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి పలు సూచనలు చేశారు. అలాగే ఈవిఎం గోడౌన్ ను పరిశీలించారు. నిర్వహిస్తున్న విజిటర్స్ రిజిష్టర్, భద్రత ఏర్పాట్లను తదితరాలను పరిశీలించారు. ఎఫ్ఎల్సీ తనిఖీ అనంతరం మాట్లాడుతూ తాను భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈవిఎం ఎఫ్ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లను చూశానని , తిరుపతి జిల్లాలో ఎఫ్ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లు బాగున్నాయని , చక్కగా నిబంధనల మేరకు ఉన్నాయని కలెక్టర్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈవీఎం ల నోడల్ అధికారి కోదండరామి రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్.సి. చిరంజీవి,సిపిఐ (ఎం) సెల్వరాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ డా. వేంకట రమణ, రేణిగుంట తాసిల్దార్ ఉదయ సంతోష్, ఎలక్షన్స్ తాసిల్దార్ సురేష్, డిఎస్పీ, భద్రతా సిబ్బంది, విధులు కేటాయించబడిన సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News