Breaking News

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్. పి పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్.పి. కులశేఖర్ , ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, డిప్యూటి కలెక్టర్ లు భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, రేణిగుంట తహసిల్దార్ ఉదయ సంతోష్, డి ఎస్ పి భవ్య , స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను రెవెన్యూ , పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ రోడ్డు మార్గాన తిరుమల బయలుదేరి వెళ్ళారు. నేటి రాత్రి తిరుమలలో బస చేసి , తేది.22 న ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మద్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని బెంగళూరు వెళ్లనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *