తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహం లో భాగంగా తిరుపతి అంకాలమ్మ గుడి దగ్గర గల ఎస్.ఆర్.కన్వెన్షన్ హాల్ నందు ఈ నెల తేది 30 నుండి నవంబర్ 8 వరకు రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయన్నున్నట్లు ఎపి ఖాది, గ్రామీణ ఉత్పత్తుల బోర్డ్ సి ఇ ఓ విజయరాఘవ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ ఉత్పత్తులకు చేయూతనిచ్చే ప్రోత్సాహంలో భాగంగా తిరుపతిలో రాష్ట్ర చేనేత, జౌళి , పరిశ్రమల శాఖ మంత్రి గుడి వాడ అమర్నాద్ గారు ఈ నెల తేది 30 న ప్రారంభి౦చనున్నారని, నగర ప్రజలు పాల్గొని మన సంస్కృతి, సంప్రదాయాల వస్తువులకు సహకారం అందించాలని ఆ ప్రకటనలో కోరారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News