తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎక్సైజ్ పాలసీ పగద్భందీగా అమలు చేయాలని రాష్ట్ర సరిహద్దు ఎస్ ఇ బి చెక్ పోస్ట్ ల వద్ద మరింత పటిష్ట నిఘా వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ పై జిల్లా కలెక్టర్ ఎకైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపుల నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలింపు పై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తీ స్థాయిలో అరికట్టాలని అన్నారు. మద్యం అమ్మకాలకు సంబంధించిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చలాన్ల ద్వారా చెల్లింపులు జరగాలని సూచించారు. మద్యం ధరలపై వున్న రేట్లకే అమ్మకాలు జరగాలని తేడా వున్నట్లు తెలిస్తే తప్పనిసరి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో వున్నన అమ్మక కేంద్రాల్లో స్టాక్ వెరిఫికేషన్ తరచూ జరగాలని సూచించారు. షాపుల రెన్యువల్ వివరాలు ఖచ్చితంగా నమోదు జరగాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారి రాజేంద్ర , ఎక్సైజ్ సూపరిన్ టెన్ డెంట్ జానికిరాం, ఎ ఇ ఎస్ లు, గూడూరు- రమేష్ , తిరుపతి -నాగరాజ రెడ్డి , బెవరేజస్ ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News