రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో త్రాగు నీటి వనరులు, జిల్లాలో ప్రజలకు రక్షిత నీటి వనరులు ఏర్పాటుకు నిర్దేశించిన కార్యాచరణ కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం సాయంత్రం ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 669 జల జీవన్ మిషన్ కింద రూ.274 కోట్ల అంచనాతో చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న ఇండ్ల కాలనీలో పూర్తి చేసిన ఇండ్లకు త్రాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకుని వచ్చెందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన పనులకు చెందిన బిల్లులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. స్థానికంగా ఎటువంటి ఇబ్బందులూ, సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. 182 పనులు పూర్తి చెయ్యగా, 207 పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 259 పనులను సంబంధిత ఏజెన్సీ లకు అప్పగించాలి అని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏవిధమైన సమస్య ఉత్పన్నమైనా తన దృష్టికి తీసుకుని రావాల్సి ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం గ్రాంటు కింద రు.22.06 కోట్లతో గుర్తించిన 668 పనులకు 298 పనులు పురోగతిలో ఉండగా, 355 పూర్తి చేశారని, మిగిలిన పనులు పూర్తి చెయ్యడం తో పాటు పెండింగ్ బిల్లులు చెల్లింపుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. జగనన్న హౌసింగ్ కాలనీల్లో శాశ్వత ప్రాతిపదిక కింద రూ .96.77 కోట్ల అంచనాతో మంజూరు చేసిన 404 పనులలో 145 పూర్తి చేశారని, మిగిలిన వాటికి చెందిన టెండర్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కి చెందిన లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రణాళిక ప్రకారం అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి డి..బాల శంకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News