Breaking News

ఈవీఎం గోడౌన్లో ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి) పకడ్భందిగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాజకీయపార్టీ ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల సంఘం అదేశాల మేరకు ప్రతి వారం నిర్వహించే రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశంలో భాగంగా గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లో ఈవీఎం గోడౌన్లో ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి) ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాజకీయపార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 16వ తేది నుండి ప్రారంభమైన ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ప్రక్రియ నిద్ధేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 1605 బ్యాలెట్‌ యూనిట్లు, 1605 కంట్రోల్‌ యూనిట్లు, 1695 వివిప్యాట్‌ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. చెకింగ్‌ నిర్వహణలో ఎటువంటి పొరపాట్లుకు తావు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తున్నామని, రోజుకు 285 యూనిట్ల చొప్పున 20 రోజులపాటు 5,700 పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామని కలెక్టర్‌ డిల్లీరావు రాజకీయపార్టీ ప్రతినిధులకు వివరించారు. పరిశీలనలో కలెక్టర్‌ వెంట డిఆర్‌వో ఎస్‌ వి. నాగేశ్వరరావు, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌.దుర్గాప్రసాద్‌, రాజకీయపార్టీ ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *