Breaking News

‘ఖాదీ మహోత్సవ్’ కార్యక్రమం విజయవంతం చేయాలి

-నేటి నుంచి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం చేపడుతున్న ‘ఖాదీ మహోత్సవ్’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ‘ఖాదీ మహోత్సవ్’ అంశంగా అన్ని పాఠశాలల్లో క్విజ్, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. క్విజ్ పోటీలో ఈ నెల 31 వరకు ఎవరైనా పాల్గోవచ్చన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలను పాఠశాల స్థాయిలో నేడు (26.10.23), మండల స్థాయిలో 27న, జిల్లా స్థాయిలో 28న నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలను భాషలు, కేటగిరీ వారీగా వివరాలను సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి 29వ తేదీలోపు పంపాలని ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్ష ఏపీసీలకు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *