Breaking News

దీర్ఘకాలిక వ్యాధులకు కూడా బరోసా ఇస్తున్నాం- వెలంపల్లి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు

-ప్రతి ఒక్క గడపకి ఖచ్చితమైన ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ముఖ్య ఉద్దేసం -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరికి మంచి వైద్యం అందిస్తూ, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా జగనన్న ఆరోగ్య శ్రీ ద్వార ఖచ్చితమైన ఆరోగ్యం బరోసా ఇస్తున్నాం అని అన్నారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు. వాలంటీర్ల ద్వార ప్రతి ఒక్క గడపకు వెళ్లి, వాళ్ళను అడిగి తెలుసుకొని, ప్రజల ఖచ్చితమైన ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ముఖ్య ఉద్దేసం అని అన్నారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 43,45,53,54 డివిజన్లలో 4 సచివాలయలలో పరిదిలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ రోజు 4 సచివాలయం లో పరిదిలో జరుగుతున్నాయన్నారు.అందరికీ మంచి వైద్యం చేసి చక్కటి మందులు ఇస్తున్నట్లు తెలిపారు.మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.దీర్ఘకాలిక వ్యాధులకు కూడా బరోసా ఇస్తున్నామని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ చూపుత్తున్నారన్నారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు .అందరికీ ఇంటి ముంగిటలో వైద్య వ్యవస్థ తీసుకొచ్చాం అని అన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ద్వారా వాలంటీర్లు, ఏ ఎన్ యంలు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు పరాజి ఒక గడపకు వెళ్లి రక్త పరీక్షలు చేసి వాళ్లకున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి వాళ్ళను ఆరోగ్యవంతులుగా చేస్తున్నందుకు ఇటువంటి శిబిరాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని. కనీ విని ఎరుగని రీతిలో క్వాలిఫైడ్ డాక్టర్లచే ఈ సిబిరంలో వాళ్లకి నిర్ధారించిన వ్యాధులకు వాళ్లకి సంవత్సరం పాటైనా సరే రక్త పరీక్షలు మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ శిబిరంలో మందులకు తగ్గినవి ఏవైనా సమస్యలు ఉన్నచో ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఆసుపత్రులకు పంపించి పూర్తిగా ఆరోగ్యవంతులుగా చేసేదాకా జగనన్న సురక్ష వాళ్లకు తోడుగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి,మైలవరపు మాధురి లావణ్య,మహాదేవు అప్పాజీరావు, అర్షద్ అకిబ్ తదితర కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయం సిబ్బంది,ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *