Breaking News

ఘనంగా గరికిముక్కు రవికుమార్‌ జన్మదిన వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సేవలో గుర్తుండే యువ నాయకులలో వైఎస్సార్‌సీపీ యువ జన విభాగం రాష్ట్ర కార్యదర్శి గరికిముక్కు రవికుమార్‌ ఒకరు. అటువంటి సామాజికవేత్త, యువనాయకుడు గరికిముక్కు రవికుమార్‌ జన్మదిన వేడుకలు యూత్‌ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాను ఆధ్వర్యంలో అమ్మా నాన్న ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కొండపల్లి ఐడిఎలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. గొల్లపూడి గ్రామం అంబేద్కర్‌నగర్‌ కాలనీలో దుగ్గిరాల కిషోర్‌ ఆధ్వర్యంలో షటిల్‌ బాట్‌ టోర్న మెంట్‌లో 20 టీంలు పాల్గొన్న విజేతలకు రన్నర్‌, మొదటి, రెండవ, మూడవ బహుమతులు మరియు ప్రైజ్‌ మనీ అందజేశారు. గరికిముక్కు తేజ, దర్శనం వంశీ, పెరికల ప్రవీణ్‌, మత్తే చిట్టిరాజు, గరికిముక్కు కళ్యాణ్‌, యనమల శ్రీకాంత్‌ తదితరులు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రేమల్లి శ్రీకాంత్‌, పోసి ప్రసాద్‌, రేమల్లి నవక్రాంత్‌ మరియు అంబేద్కర్‌నగర్‌ యూత్‌ పాల్గొ న్నారు. అలాగే గొల్లపూడి గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్‌లో 18 టీమ్స్‌తో పాల్గొని ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది ప్రైజ్‌ మనీ మరియు బహు మతులు అందచేస్తామని, భవిష్యత్‌లో గరికిముక్కు రవికుమార్‌ ఆధ్వర్యంలో మరిన్ని సామా జిక, సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు గరికిముక్కు రవికుమార్‌ స్నేహితులు తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *