Breaking News

టైమ్స్ ఆఫ్ ఇండియా వారు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుండి సహకారం అందిస్తాం: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక బాధ్యతగా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రీన్ డ్రైవ్ కార్యక్రమం కింద తిరుపతి జిల్లా నందు సుమారు 50 వేల నుండి లక్ష మొక్కలను శ్రీ సిటీ మరియు తదితర పారిశ్రామిక ప్రాంతాలలో నాటి పర్యావరణ పరిరక్షణ దిశగా చేస్తున్న మంచి కార్యక్రమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు సంబంధిత అధికారులతో సమావేశమై తిరుపతి జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా టైమ్స్ అఫ్ ఇండియా,న్యూ ఢిల్లీ వారు గ్రీన్ డ్రైవ్ ఇనిషియేటివ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీ సిటీ మరియు ఇతర పారిశ్రామిక వాడల లో చేపట్టటానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో జోనల్ మేనేజర్ ఏపీఐఐసి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమన్వయంతో వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే అటవీ శాఖ వారు కూడా అవసరం మేరకు మొక్కలు నాటే కార్యక్రమానికి సహకారం అందించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వారు చేస్తున్న ఈ కృషి అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సందీప్ సూద్ వివరిస్తూ వారు గతంలో నుండే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, హరిత వన అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టామని తిరుపతి జిల్లాలో సూచించిన ప్రాంతాలలో 50 వేల నుండి లక్ష వరకు మొక్కలను నాటి వాటిని మూడు సంవత్సరాల వరకు సంరక్షిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాపరెడ్డి, జెడ్ ఎం ఏపీఐఐసీ చంద్రశేఖర్, డిపిఓ రాజ శేఖర్ రెడ్డి, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *