-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కారాగారంలో పొరుగు సేవల ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు టెస్టులు నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు వారికి కేటాయించిన తేదిలలో ఇంటర్య్వూలకు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని జిల్లా కారాగారంలో డ్రైవర్, స్వీపర్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎలక్ట్రిషన్ పోస్టులను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. అభ్యర్థులు చేసుకున్న ధరఖాస్తులను స్వకరించి అర్హులైన వారి జాబితాను సిద్దం చేయడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్య్వ్యూలు టెస్టులను నిర్వహించి పోస్టులలో నియమాకానికి ఎంపిక చేయనున్నామన్నారు. డ్రైవర్ పోస్టు భర్తీకి గాను ఈనెల 8వ తేదిన ఉదయం 10.30 నిమిషాలకు గన్నవరం రిజనల్ ట్రైన్స్‌పోర్ట్ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని డ్రైవింగ్ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలన్నారు. స్వీపర్ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో వరుస సంఖ్య 1 నుండి 43 వరకు గల అభ్యర్థులు ఈనెల 14వ తేదిన వరస సంఖ్య 44 నుండి 86 వరకు గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు విజయవాడ జిల్లా జైలు పర్యవేక్షణధికారి వారి కార్యాలయానికి హాజరు కావాలన్నారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగానికి అభ్యర్థులు ఈనెల 17వ తేదిన, ఎలక్ష్రిషన్ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18వ తేదిన విజయవాడ జిల్లా జైలు పర్యవేక్షణధికారి వారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఆయా తేదిలలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News