Breaking News

జిల్లాలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టులలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాల పోస్టు భర్తీ

-జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి.ఉమాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్‌ జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాల పోస్టుల భర్తీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ అర్బన్‌, విజయవాడ రూరల్‌ మైలవరం చిల్లకల్లు నందిగామ మరియు తిరువూరు పరిధిలో రెండు అంగన్వాడి కార్యకర్త పోస్టులు, 61 అంగన్‌ వాడి సహాయకురాల పోస్టులను రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. పోస్టులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానిక వివాహిత మహిళాలైన వారికి మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈనెల10వ తేది లోపు అందజేయవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంభందిత ఐసిడిఎస్‌ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *