Breaking News

ఏస్పా భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ అక్యూపంచర్ డే ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీ ఆవరణలో ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపంచర్ డే 2023 ఉత్సవాలను కళాశాల డీన్ రాజేష్ చౌదరి ప్రారంభించినారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత్ జాతీయ జనరల్ సెక్రటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా లాంటి మహమ్మారి ల బారిన పడి కోలుకోవాలి అనుకునే ప్రపంచానికి ఆక్యుపంచర్ సైన్స్ ఉన్నత చికిత్స అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసినారు. ఎస్పా భారత్ ప్రజలు ఈ ఆక్యూపంచర్ సైన్సును సాంప్రదాయ ,ఆచారం పేరు మీద ఆచరించడం వలన కరోనా తీవ్రత గణనీయంగా తగ్గటానికి కారణం. దీనితో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలపై 15 నెలల క్రింద పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిందని దీని ఫలితాలు ప్రపంచానికి అందనున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. భారతదేశంలో ఉన్నతమైన ఆక్యుపంచర్ సైన్స్ విధానాలను విస్తృత ప్రచారం చేయటానికి దేశవ్యాప్తంగా 15 రోజులపాటు అవగాహన ఆరోగ్య శిబిరాలు మరియు విశిష్ట కృషి చేసిన వారికి అవార్డ్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమం సిద్ధార్థ కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆక్యుపంచర్ తెరపిస్టులు భూతపాటి ఉదయ్ కుమార్ ,ఆశ్రపునిష , త్వుశిక్,చెన్న అప్పారావు, భగవాన్ వగైరా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *